ఆసియా కప్ 2023 : గ్రౌండ్ లోనే వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ కెప్టెన్ బాబర్..

ఆసియా కప్ 2023 : గ్రౌండ్ లోనే వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ కెప్టెన్ బాబర్..

ఆసియా కప్ లో పాకిస్థాన్ ఇంటి దారి పట్టింది. ఫైనల్ కి వెళ్లాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచులో శ్రీలంకపై చివరి వరకు పోరాడి ఓడిపోయింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ కు చివరి బంతికి ఫలితం వచ్చింది. దీంతో ఫైనల్ కి వెళ్ళాలనే పాకిస్థాన్ కి నిరాశే ఎదురైంది. గెలుపోటములు ఆటలో భాగమే అయినా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఏడుపు మాత్రం అందరిని కలిచి వేస్తుంది.
 
మ్యాచ్ తర్వాత భావోద్వేగం 

ఈ టోర్నీకి ముందు పాకిస్థాన్ ఆసియా కప్ ఫేవరేట్ గా బరిలోకి దిగింది. నేపాల్ పై మ్యాచ్ గెలిచిన తర్వాత వన్డేల్లో నెంబర్ వన్ గా అవతరించిన పాకిస్థాన్.. మరింత ఆత్మ విశ్వాసంతో ముందుకు దూసుకెళ్లింది. సూపర్-4లో భాగంగా తొలి మ్యాచులో బంగ్లాదేశ్ మీద గ్రాండ్ విక్టరీ కొట్టి శుభారంభం చేసిన బాబర్ సేన.. ఆ తర్వాత పసికూన జట్టుని తలపించింది. భారత్ పై భారీ తేడాతో ఓడిపోవడంతో పాటు కీలక ప్లేయర్లను దూరం చేసుకుంది.
 
ఇక నిన్న గెలవాల్సిన మ్యాచులో ఫీల్డింగ్ తప్పిదాలతో మ్యాచ్ ఓడిపోవడంతో బాబర్ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోయాడు. చేయి అడ్డం పెట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించాడు. ఇప్పటివరకు బాబర్ ఏడవడం చూడని క్రికెట్ ఫ్యాన్స్ ఈ స్టార్ ప్లేయర్ మీద సానుభూతి చూపిస్తన్నారు. నువ్వు ఛాంపియన్ ప్లేయర్ వి క్రికెట్ లో ఇవన్నీ సహజం అని ఓదార్చే పనిలో ఉన్నారు.